భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

ABN , First Publish Date - 2022-02-04T05:40:53+05:30 IST

శ్రీ వాసవీకన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గురువారం పట్టణంలోని సకలదేవతల ఆలయం, శ్రీవాసవీ కన్యకాపర మేశ్వరీ దేవా యా లలో ఘనంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం
జడ్చర్ల సకలదేవతల ఆలయంలో అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

- శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరికి పూజా కార్యక్రమాలు


జడ్చర్ల, ఫిబ్రవరి 3 : శ్రీ వాసవీకన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గురువారం పట్టణంలోని సకలదేవతల ఆలయం, శ్రీవాసవీ కన్యకాపర మేశ్వరీ దేవా యా లలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని  సకలదేవతల ఆలయంలో ఉదయం గణపతిపూజ ఆత్మార్పణ దినోత్సవం పూజలు ప్రారం భించారు. అనంతరం గోపూజ నిర్వహించి, శివాభిషేకం చేశారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమలపాకు పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం హోమంను ఘనంగా నిర్వహిం చారు. శ్రీవాసవీకన్యకపరమేశ్వరీ దేవాలయంలో లలితసహస్రనామ హోమం, నారాయణ హోమం, వాసవీమాత సామూహిక కుంకుమార్చ నలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సకలదేవతల ఆలయంలో పాలాది శ్రీనివాసులు, పాలాది రమేశ్‌ భక్తులు పాల్గొన్నారు. 


వాసవీమాత మాలధారణోత్సవం


మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 : వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్స వం పురస్కరించుకొని గురువారం వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి ఇంట న్నేషన్‌ వారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులచే మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. 35 మంది వాసవి క్లబ్‌,  వనితా క్లబ్‌ సభ్యులు వాసవి మాలధారణ చేపట్టారు. ఆలయ ప్రధాన పూజారి రాఘవేంద్ర శర్మ  వాసవీ మాత త్యాగం, విశిష్టత గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు మీడి శెట్టి రమేష్‌, ప్రధాన కార్యదర్శి వలకొండ చంద్రశేఖర్‌, కోశాధికారి పురం రాజు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-04T05:40:53+05:30 IST