Abn logo
Sep 25 2021 @ 18:24PM

తల్లి జింక సాహసం.. బిడ్డ కోసం పణంగా ప్రాణాలు

ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం మరొకటి ఉండదేమోనని అనిపిస్తుంది. బిడ్డ ఆకలి తీర్చడంతో పాటు ఏదైనా ఆపద వచ్చిందంటే ప్రాణాలు అడ్డు వేసి తన బిడ్డను కాపాడుకుంటుంది. ఇలా తల్లి ప్రేమను చూపించడంలో మనుషులే కాదు జంతువులు కూడా ముందుంటాయి. ఓ జింక  తన బిడ్డను కాపాడుకునేందుకు ఏకంగా తన ప్రాణాలనే అడ్డుపెట్టింది. ఓ జింకల మంద నది నుంచి  క్షేమంగా  దాటగా  పిల్ల జింక మాత్రం నదిని దాటడంలో ఆలస్యం చేసింది. దీంతో ఒక్కసారిగా మొసళ్లు వేగంగా రావడం తల్లి జింక గమనించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగు పరుగున మొసళ్లకు తాను అడ్డంగా వెళ్లింది. ఇంకేముంది ఆ మొసళ్లు తల్లి జింకను ఎరగా చేసుకుని వేటాడాయి. చివరకు తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు కవచంలా ఆ జింక నిలిచింది. దీంతో మొసళ్ల బారిన పడకుండా పిల్ల జింక తప్పించుకుంది. ఇలా తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి జింక చేసిన సాహసం చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో చాలా పాతదే అయినా ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ప్రత్యేకంమరిన్ని...