Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లికూతురిలా ముస్తాబైన తల్లిని చూసి నాలుగేళ్ల కూతురు చేసిన కామెంట్స్.. నెట్టింట వీడియో వైరల్

ఇంటర్‌నెట్‌డెస్క్: ‘అమ్మా.. ఎక్కడున్నావ్..’అంటూ ఆ చిన్నారి తల్లి కోసం వెతికింది. చివరికి ఓ చోట కనిపించింది. పెళ్లికూతురిలా ముస్తాబైన తల్లిని చూసి ఆశ్చర్యపోయిన చిన్నారి ఓ మాట అనింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే..


అంజలి మంచందా అనే మేకప్ ఆర్టిస్ట్‌కు నాలుగేళ్ల కూతురు ఉంది. ఆ చిన్నారి తన తల్లి కోసం ఇళ్లంతా వెతికింది. చివరికి అంజలి ఓ గదిలో ఉండడం గమనించింది. అంజలి పెళ్లికూతురిలా ముస్తాబవడం చూసిన ఆమె కూతురు ఆశ్చర్యపోయింది. ‘అమ్మా.. నువ్వు చాలా బాగున్నావు..’అని వెంటనే అనేసింది. ఆ చిన్నారి అలా ముద్దు ముద్దుగా అనడంతో తల్లి ఎంతో సంతోషించింది. అంజలి అంత అందంగా తయారవడానికి ఓ కారణముంది. ఏంటంటే ఆ రోజు ఆమె పెళ్లిరోజు. 


పెళ్లిరోజు సందర్భంగా అంజలి పింక్ కలర్ లెహంగాతో పాటు, పెళ్లికూతురు మాదిరిగా ఆభరణాలు ధరించింది. అంజలిని అందంగా ముస్తాబుచేసిన మేకప్ ఆర్టిస్ట్ గునీత్ విర్ది అనే మహిళ ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసింది. తన తల్లిని అందంగా ముస్తాబు చేసిన గునీత్‌కు ఆ చిన్నారి థ్యాంక్స్ చెప్పింది. తల్లి ధరించిన గాజులు కూడా ఆ చిన్నారికి నచ్చాయి. అందంగా తయారైన తల్లిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది.


‘పెళ్లికూతురిలా ఉన్న తల్లిని చూసి ఆ చిన్నారి చాలా సంతోషించింది.. కంగ్రాట్స్ అంజలి’ అంటూ క్యాప్షన్ పెడుతూ గునీత్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్‌గా మారింది.  ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4లక్షల మంది చూశారు. 32వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. ‘తల్లి, కూతురు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు’అని ఒకరు కామెంట్ చేయగా, ‘ఈరోజు నేను చూసిన వీడియోలలో అందమైనది ఇదే..’అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement