Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 7 2022 @ 17:53PM

16 ఏళ్ల కూతురు గర్భవతి అని తెలిసి నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు.. బయటకు తెలిస్తే పరువు పోతుందని ఎంత పని చేశారంటే..

లక్నో: ఆ బాలిక వయసు పదహారేళ్లు. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లి వచ్చిన ఆమె ఓ రోజు అస్వస్థతకు గురైంది. తల్లిదండ్రులు వెంటనే కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పారు. అది విని కుటుంబసభ్యులు నివ్వెరపోయారు. పెళ్లికి ముందే కూతురు గర్భవతి అయిందని బయటకు తెలిస్తే తమ కుటుంబం పరువు పోతుందని ఎంత పని చేశారంటే..


ఉత్తరప్రదేశ్‌లోని చౌబేపూర్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక కుటుంబసభ్యులతో కలిసి ఉంటుంది. ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజిలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు కాలేజిలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో సమయం దొరికినపుడల్లా ఆ ప్రేమజంట కలుసుకునేది. ఈ క్రమంలోనే ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే ఉన్నట్టుండి ఓ రోజు ఆమె అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని తెలిపారు. అది విని కుటుంబసభ్యులు నివ్వెరపోయారు. పెళ్లికి ముందే తమ కూతురు గర్భవతి అయితందని బయట తెలిస్తే తమ పరువు పోతుందని భావించి దారుణానికి ఒడిగట్టారు.

తల్లి, సోదరుడు కలిసి మంగళవారం బాలిక గొంతు నులిమి హత్య చేశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఉరికి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాలికది ఆత్మహత్యనేని అప్పటివరకూ భావించిన పోలీసులు బుధవారం పోస్టుమార్టం రిపోర్టు చూసి కంగుతిన్నారు. ఆ రిపోర్టులో బాలిక నాలుగు నెలల గర్భవతని.. గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు బాలిక తల్లి, సోదరుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అపుడు అసలు నిజం బయటపడింది. కూతురు గర్భవతని తెలియడంతో అబార్షన్‌ చేయించుకోమని అడగ్గా అందుకు ఆమె ఒప్పుకోలేదని బాలిక తల్లి చెప్పింది. పెళ్లికి ముందే కూతురు గర్భవతి అయిందని బయట తెలిస్తే తమ కుటుంబం పరువు మొత్తం పోతుందనే భయంతో తామే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు బాధితురాలి తల్లి, సోదరుడితో పాటు ప్రియుడిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు.

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement