Abn logo
Aug 29 2021 @ 19:20PM

దారుణం: వీపుపై వాతలు, నోటిపై పిడిగుద్దులు..ఏడాది చిన్నారిని చితకబాదిన తల్లి

చిత్తూరు: నవమాసాలు మోసి కని పెంచిన తల్లి.. బిడ్డ కోసం ఏమైనా చేస్తుంది. చివరకు ప్రాణమైనా ఇస్తుంది. కానీ ఓ తల్లి మాత్రం కర్కశత్వానికి పాల్పడింది. భర్తపై కోపంతో కొడుకును హింసించింది. రాక్షస ఆనందం పొందింది. చిన్నారి వీపుపై వాతలు పడేలా కొట్టింది. నోటిపై పిడిగుద్దులు గుద్దింది. కాలిపై దారుణంగా కొట్టింది. ఆ చిన్నారి రోదనలు మిన్నంటాయి. ఈ దృశ్యాలన్నీ ఆమె స్వయంగా చిత్రీకరించింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన తల్లీకొడుకుల బంధానికి మాయని మచ్చలా మిగిలింది.