తల్లిపై దాడి చేసిన అన్నను చంపిన తమ్ముడు

ABN , First Publish Date - 2021-10-20T14:53:28+05:30 IST

అల్పాహారం చేయని తల్లిపై దాడి చేశాడన్న కారణంతో అన్నపై దాడి చేసి అతనిని హత్య చేసిన తమ్ముడిని నగర పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక విల్లివాక్కం, బలరామపురంలో ఈ ఘటన జరిగింది. ఈ విధికి చెం

తల్లిపై దాడి చేసిన అన్నను చంపిన తమ్ముడు

అడయార్‌(chennai): అల్పాహారం చేయని తల్లిపై దాడి చేశాడన్న కారణంతో అన్నపై దాడి చేసి అతనిని హత్య చేసిన తమ్ముడిని నగర పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక విల్లివాక్కం, బలరామపురంలో ఈ ఘటన జరిగింది. ఈ విధికి చెందిన శివరాజ్‌(46) అనే వ్యక్తికి ధనలక్ష్మి(67) అనే తల్లి, ప్రకాష్‌(44) అనే తమ్ముడు ఉన్నాడు. శివరాజ్‌ స్థానిక ఐసీఎఫ్‌లో పనిచేస్తూ వీఆర్‌ఎస్‌ తీసుకుని అవివాహితుడుగానే ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తల్లి వద్ద టిఫన్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. ఆమె ఏదో కారణం చెప్పడంతో ఆగ్రహించిన ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు ప్రకాష్‌ ఆగ్రహంతో అన్న శివరాజ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తలకు బలమైన గాయం తగలడంతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

Updated Date - 2021-10-20T14:53:28+05:30 IST