Abn logo
Sep 26 2021 @ 01:29AM

సీతారాం ఏచూరి మాతృమూర్తి మృతి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంఘసేవకురాలు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తల్లి, విద్యావేత్త కల్పకం ఏచూ రి(88) శనివారం ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించా రు. కల్పకం భౌతికదేహాన్ని ఆమె అభీష్టం మేరకు ఒక మెడికల్‌ కాలేజీకి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కల్పకం 1933 జూన్‌ 6న మద్రా్‌సలో జన్మించారు. మద్రాస్‌ క్వీన్‌ మేరీ కాలేజీలో చదివిన కల్పకం బీహెచ్‌యూలో ఎంఫిల్‌ చేశారు. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌, వేముగంటి బొప్పాయమ్మ వంటి స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి పనిచేశారు. ఏఐడబ్ల్యూసీలో పనిచేశారు. కల్పకం పెద్ద కుమారుడు సీతారాం ఏచూరి సీపీఎం ప్రధానకార్యదర్శి. రెండో కుమారుడు భీమశంకర్‌ మారుతీ కంపెనీలో పనిచేశారు. ఆమె సోదరుడు మోహన్‌ కందా ఉమ్మడి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా చేశారు.