గ్రామాల్లో మాతృశక్తిని జాగృతం చేయాలి

ABN , First Publish Date - 2022-07-18T04:42:08+05:30 IST

జిల్లాలో ప్రతీ గ్రా మంలో దేవాలయాలను కేంద్రంగా చేసుకొని మాతృశక్తిని జాగృతం చేయాలని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ముడుపు యాదగిరి అన్నారు.

గ్రామాల్లో మాతృశక్తిని జాగృతం చేయాలి
మాట్లాడుతున్న వీహెచ్‌పీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదగిరి

- రాష్ట్ర సంఘటన కార్యదర్శి ముడుపు యాదగిరి

మహబూబ్‌నగర్‌ టౌన్‌/ పద్మావతీ కాలనీ, జూలై 17 : జిల్లాలో ప్రతీ గ్రా మంలో దేవాలయాలను కేంద్రంగా చేసుకొని మాతృశక్తిని జాగృతం చేయాలని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ముడుపు యాదగిరి అన్నారు. గ్రామాల్లో అప్పుడే మతమార్పిడిలు ఆగిపోతాయని ఆయన అన్నారు. పాలమూ రు వీహెచ్‌పీ కార్యాలయంలో ఆదివారం జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక విషయాలపై మార్గదర్శనం చేశారు. మహిళలను జాగృతం చేయటానికి జిల్లా కేంద్రంలో అక్టోబరు 9న మాతృశక్తి సమ్మేళనం నిర్వహించాలని, మాతృశక్తి కమిటీలు వేయాలని కోరారు. 

జిల్లా కమిటీలో మార్పులు

 ఇప్పటి వరకు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మద్ది యాదిరెడ్డి ఇకపై జిల్లా సలహా సభ్యుడిగా ఉంటారని తెలిపారు. జిల్లా నూతన అధ్యక్షులుగా గుద్దేటి చంద్రయ్య వ్యవహరిస్తారని యాదగిరి తెలిపారు. జిల్లా బజరంగ్‌ ప్రముఖ్‌గా అనిల్‌గౌడ్‌, జిల్లా మందిర ప్రముఖ్‌గా గుబ్బ భరత్‌, జిల్లా ధర్మాచారి ప్రముఖ్‌గా రెబ్బె విఘ్నేష్‌, గోరక్ష ప్రముఖ్‌గా శ్రీకాంత్‌, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజీవ్‌ నామాజి, పాలమూరు నగర బజరంగ్‌ దళ్‌ ప్రముఖ్‌గా సంపత్‌, సహప్రముఖ్‌గా శివకుమార్‌ను ప్రకటించారు. ఈ సమావేశంలో ఘణపురం రాజేశ్వర్‌, సంగవిశ్వనాథ్‌, లక్ష్మారెడ్డి, అద్దని నరేంద్ర, సింధూజ, రాజేంద్ర, నలిగేశి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-18T04:42:08+05:30 IST