తల్లి పుట్టిన రోజు సందర్భంగా కొడుకు చేసిన ఈ చిన్న పని.. ఆమె కళ్లల్లో ఆనందాన్ని నింపింది

ABN , First Publish Date - 2022-01-09T15:32:16+05:30 IST

తల్లి పుట్టిన రోజు సందర్భంగా కొడుకు ఓ చిన్న పని చేశాడు. దీంతో ఆమె పట్టారని సంతోషంతో ఉప్పొగ్గిపోయింది. కొడుకు చేసిన పని చూసి సంబరపడింది. ఆప్యాయంగా కొడుకును కౌగిలించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోం

తల్లి పుట్టిన రోజు సందర్భంగా కొడుకు చేసిన ఈ చిన్న పని.. ఆమె కళ్లల్లో ఆనందాన్ని నింపింది

ఇంటర్నెట్ డెస్క్: తల్లి పుట్టిన రోజు సందర్భంగా కొడుకు ఓ చిన్న పని చేశాడు. దీంతో ఆమె పట్టారని సంతోషంతో ఉప్పొగ్గిపోయింది. కొడుకు చేసిన పని చూసి సంబరపడింది. ఆప్యాయంగా కొడుకును కౌగిలించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అవుతున్నారు. ఆ కొడుకుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



అమ్మ.. రెండు అక్షరాల ఈ పదం గురించి ఎంత చెప్పినా తక్కువే. పురిటి నొప్పులను తట్టుకుని జన్మనిచ్చి.. ఆ తర్వాత కూడా కట్టికిరెప్పలా చూసుకుంటుంది. ఎన్నో సపర్యలు చేస్తుంది. తాను ఎన్ని బాధలు పడైనా.. బిడ్డల ముఖంలో సంతోషం చూడాలనుకుంటుంది. కాగా.. చిన్నపట్టి నుంచి తన గురించి తల్లి పడిన కష్టాన్ని చూస్తూ పెరిగి తమిళనాడుకు చెందిన విఘ్నేష్.. తన మాతృమూర్తి కళ్లల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఇందుకోసం ఆమె పుట్టిన రోజు సందర్భంగా రూ.8,800 విలువైన మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. విఘ్నేష్ అందించిన బ్యాగులో మొబైల్ ఫోన్‌‌ను చూసి, అతడి తల్లి ఆనందంతో ఉప్పొగ్గిపోయింది. వెంటనే ఆప్యాయంగా అతడిని కౌగిలించుకుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న కుర్చిలో కూర్చొని.. మొబైల్ ఉన్న బ్యాగును హత్తుకుంది. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతలో పోస్ట్ చేసిన విఘ్నేష్.. తన తల్లి ఆనందం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విఘ్నేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 






Updated Date - 2022-01-09T15:32:16+05:30 IST