వాటర్ ట్యాంక్‌లో నీరు పట్టేందుకు మూత తీసి లోపలికి వెళ్లిన తల్లి.. అరగంట తర్వాత తిరిగి వచ్చి చూసే సరికి..

ABN , First Publish Date - 2021-12-27T21:54:30+05:30 IST

మున్సిపల్ పైప్ నుంచి వచ్చే నీటిని పట్టడం కోసం ఆ మహిళ తమ ఇంట్లో ఉన్న ట్యాంక్ మూత ఓపెన్ చేసింది..

వాటర్ ట్యాంక్‌లో నీరు పట్టేందుకు మూత తీసి లోపలికి వెళ్లిన తల్లి.. అరగంట తర్వాత తిరిగి వచ్చి చూసే సరికి..

మున్సిపల్ పైప్ నుంచి వచ్చే నీటిని పట్టడం కోసం ఆ మహిళ తమ ఇంట్లో ఉన్న ట్యాంక్ మూత ఓపెన్ చేసింది.. పైప్‌ను ట్యాంక్‌లో పెట్టి వంట పని చూసుకునేందుకు వెళ్లింది.. ఆమె ఆరేళ్ల కూతురు, రెండేళ్ల కొడుకు బయట ఆడుకుంటున్నారు.. అరగంట తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి ఆమె ఆరేళ్ల కూతురు వాటర్ ట్యాంక్‌లో విగత జీవిగా పడి ఉంది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న భైరూలాల్ తన భార్య కిరణ్, ఆరేళ్ల కూతురు చాందిని, రెండేళ్ల కొడుకు విరాజ్‌తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు మున్సిపల్ పైప్ నుంచి నీళ్లు రావడంతో వాటిని పట్టేందుకు కిరణ్ తమ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్ మూత తీసింది. ఆ పక్కనే చాందిని, విరాజ్ ఆడుకుంటున్నారు. మూత తీసి పైప్ లోపల పెట్టేసిన కిరణ్ తిరిగి మూత వేయకుండా ఇంట్లోకి వెళ్లిపోయింది. 


ఇంట్లో వంట పని చేసుకుని అరగంట తర్వాత బయటకు వచ్చింది. అయితే ఆమెకు చాందినీ కనిపించలేదు. బయటకు వెళ్లిందేమో అని చుట్టుపక్కలంతా వెతికింది. గంట పాటు వెతికి వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లి చూసింది. లోపల చాందిని విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఆ చిన్నారిని హాస్పిటల్‌కు తరలించింది. అప్పటికే ఆ బాలిక మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. 

Updated Date - 2021-12-27T21:54:30+05:30 IST