San Fransisco: బిడ్డ కోసం సింహానికే షాకిచ్చిన మహిళ.. వట్టిచేతులతోనే..

ABN , First Publish Date - 2021-08-29T22:52:18+05:30 IST

కన్నతల్లి ప్రేమకు విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. తన పిల్లల కోసం తల్లి ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుంది. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. తాజాగా అలాంటి..

San Fransisco: బిడ్డ కోసం సింహానికే షాకిచ్చిన మహిళ.. వట్టిచేతులతోనే..

శాన్‌ఫ్రాన్సిస్కో: కన్నతల్లి ప్రేమకు విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. తన పిల్లల కోసం తల్లి ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుంది. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. తాజాగా అలాంటి ఓ వీర మాత, ధీర వనితకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కన్న బిడ్డ కోసం వట్టి చేతులతోనే సింహంతో పోరాడి, ఆ మృగంపై పిడిగుద్దులు కురిపించి తన బిడ్డను కాపాడుకుంది.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ 5ఏళ్ల చిన్నారి ఇంటిబయట లాన్‌లో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కొండ సింహం అక్కడికి వచ్చి చిన్నారిని నోటకరుచుకుంది. దాదాపు 45గజాల దూరం లాక్కెళ్లింది. ఈ క్రమంలోనే ఆ బిడ్డ పెద్దగా కేకలు వేయసాగాడు. ఇంట్లో పని చేసుకుంటున్న తల్లికి ఆ కేకలు వినిపించడంతో.. ఏమైందోనని ఆందోళనగా ఆమె బయటకొచ్చింది.


ఈ ఘటనపై స్పందించిన వైల్డ్ లైఫ్ అధికారులు.. ఆ సింహాన్ని కాల్చి చంపేశారు. కాలిఫోర్నియా మత్స్య, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి కెప్టెన్ పాట్రిక్ ఫాయ్ ఘనటకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రమాదంలో చిన్నారికి తలకు, శరీరానికి గాయాలయ్యాయని, అయితే ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆయన చెప్పారు. అయితే సింహాన్ని పట్టుకునేందుకు ఘటనా స్థలానికి వెళ్లగా.. దాదాపు 30 కిలోల బరువున్న ఓ కొండ  సింహం తమకంట పడిందని చెప్పారు.


 ఆ క్షణం కళ్లముందు కనపడిన దృశ్యం చూసి ఒక్కసారిగా ఆమె షాక్‌తిన్నది. అయితే వెంటనే తేరుకుని.. తన బిడ్డను కాపాడడం కోసం సింహంతో పోరాడేందుకు సిద్ధమైంది. కనీసం చేతిలో ఒక్క కట్టెపుల్ల కూడా తీసుకోకుండా.. వట్టి చేతులతోనే దానిపై దాడి చేసింది. పిడిగుద్దులు కురిపించింది. ఆమె దెబ్బలకు సింహం కూడా బిత్తరపోయిందో ఏమో.. చిన్నారిని వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఇంతలో అక్కడకు వచ్చిన ఆమె భర్తతో కలిసి.. వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసింది.


 దానిని ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నించినా.. గాండ్రిస్తూ, హింసాత్మకంగా ప్రవర్తించడంతో ప్రజల భద్రత దృష్ట్యా కాల్చి చంపాల్సి వచ్చిందని వివరించారు. ఆ సింహం నుంచి సేకరించిన డీఎన్‌ఏను పరీక్షించగా.. చిన్నారిపై దాడి చేసింది ఆ సింహమేనని తేలిందని చెప్పారు. అయితే అదే ప్రాంతంలో మరో సింహం కూడా తమకు కనిపంచిందని, అయితే దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టామని ఫాయ్ వివరించారు.

Updated Date - 2021-08-29T22:52:18+05:30 IST