మాతృ భాష విద్యా వలంటీర్ల సమస్యలపై స్పందించకపోతే

ABN , First Publish Date - 2022-01-27T06:22:27+05:30 IST

తమను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మాతృ భాష విద్యా వలంటీర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏడో రోజుకి చేరుకున్నాయి. ఒంటి కాలిపై నిల్చుని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

మాతృ భాష విద్యా వలంటీర్ల సమస్యలపై స్పందించకపోతే
పాడేరులో ఒంటి కాలిపై నిల్చుని నిరసన తెలుపుతున్న మాతృ భాష విద్యా వలంటీర్లు

ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం

గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు  


పాడేరురూరల్‌, జనవరి 26: తమను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మాతృ భాష విద్యా వలంటీర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం ఏడో రోజుకి చేరుకున్నాయి. ఒంటి కాలిపై నిల్చుని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు  మాట్లాడుతూ, వలంటీర్‌ల సమస్యలపై ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని, మూడు రోజుల్లో ప్రజాప్రతినిధులు స్పందించకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వలంటీర్‌ల సంఘం జిల్లా కార్యదర్శి సర్బునాయకుడు, రామ్మూర్తి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.


చింతపల్లిలో వినూత్న నిరసన

చింతపల్లి, జనవరి 26: తమను రెన్యువల్‌ చేయాలంటూ వారం రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మాతృ భాష విద్యా వలంటీర్లు బుధవారం మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తంచేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దుతు ప్రకటించారు. 


Updated Date - 2022-01-27T06:22:27+05:30 IST