Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా సోకిన కుమారుడిని కారు డిక్కీలో పెట్టిన మహిళకు కోర్టులో ఊరట.. !

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సోకిన బిడ్డను కారు డిక్కీలో పెట్టిన అమెరికా మహిళకు కోర్టులో ఊరట లభించింది. తనకు కరోనా సోకకుండా ఉడేందుకు ఆమె జాగ్రత్త పడినందుకు ఆమెపై కేసు నమోదు చేసేందుకు కారణాలేవీ లేవని న్యాయమూర్తి గురువారం నాడు వ్యాఖ్యానించారు. దీంతో.. నిందితురాలు శారా బీమ్‌కు ఊరట లభించినట్టైంది. తన కుమారుడు(13) కరోనా బారిన పడ్డాడో లేదో కచ్చితంగా తెలుసుకునేందుకు ఆమె జనవరి 3న కరోనా పరీక్ష కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది కారు డిక్కీలో బాలుడు ఉన్న విషయాన్ని గుర్తించిషాకయ్యారు. ఇలా ఎందుకు చేశావంటూ వారు శారాను నిలయదీయగా.. తనకు వ్యాధి సోకకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చింది. 

అయితే.. బిడ్డను ఇలా నిర్బంధించడంతో అతడికి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందన్న ఆరోపణతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు. కానీ.. కోర్టు మాత్రం ఆ ఆరోపణలను తోసి పుచ్చింది. కరోనా నుంచి తనని తానుకాపాడుకునేందుకు శారా ఇలా చేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే..డిస్ట్రిక్ట్ కౌంటీ అటార్నీ(పబ్లిక్ ప్రాసిక్యూటర్) మాత్రం కేసు పైకోర్టుకు తీసుకెళబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ తీర్పును గౌరవిస్తామని చెబుతూనే న్యాయం కోసం ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. కాగా.. టెక్సాస్ రాష్ట్రంలోని హారిస్ కౌంటీకి చెందిన శారా(41) గతంలో సైన్స్ టీచర్‌గా పనిచేసింది. 

TAGS: America NRI
Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement