వ్యాక్సిన్‌తో తల్లీబిడ్డలు సురక్షితం

ABN , First Publish Date - 2021-07-30T04:59:42+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడం వలన తల్లీబిడ్డలు సురక్షితంగా ఉంటారని ఎం పీడీవో సుబ్బారెడ్డి, ప్రాథమి క ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ణి డాక్టర్‌ దీపిక పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌తో తల్లీబిడ్డలు సురక్షితం
జమ్మలమడుగులో ర్యాలీ చేస్తున్న దృశ్యం

జమ్మలమడుగు రూరల్‌, జూలై 29: కొవిడ్‌ వ్యాక్సిన్‌  వేయించుకోవడం వలన తల్లీబిడ్డలు సురక్షితంగా ఉంటారని  ఎం పీడీవో  సుబ్బారెడ్డి,  ప్రాథమి క ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ణి డాక్టర్‌ దీపిక పేర్కొన్నారు.  మండలంలోని మోరగుడి లో గురువారం గర్భిణులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించాలంటూ ఐసీ డీఎస్‌ అధికారులతో కలిసి వా రు ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ఐసీడీఎస్‌ అధికారిణి రాజేశ్వరీదేవి, పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి ఏఎన్‌ఎంలు, సచివాలయాల సిబ్బంది, మహిళా పోలీసులు, వలంటీర్లు, అంగ న్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు నగర పంచాయతీ కార్యాలయం వద్ద కమిషనర్‌ వెంకటరా మిరెడ్డి నేతృత్వంలో  కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అవగాహన ర్యాలీ నిర్వ హించారు. 

ప్రొద్దుటూరులో (టౌన్‌): కరోనా టీకా వేయించుకోవడం వలన తల్లీబిడ్డలు సురక్షితంగా ఉంటారని కౌన్సిలర్‌ జిలానీబాష పేర్కొన్నారు. గర్భవతులకు కరోనా టీకాపై స్వరాజ్యనగర్‌ సెక్టార్‌ పరిధిలో అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ముద్దనూరులో: కొవిడ్‌ టీకా పై ఎటువంటి అపోహలు వద్దని  ఆరోగ్య, శిశుసంక్షేమ, మండల పరిషత్‌, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో సీఐ హరినాథ్‌, సీడీపీవో ముంతాజ్‌బేగం, ఎంపీడీవో రమణారెడ్డి, ఈవో రాజేంద్రప్రసాద్‌రెడ్డి, హెల్త్‌సూపర్‌వైజర్‌ వరప్రసాద్‌, తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మైలవరంలో : కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహపడవద్దని ఎంపీడీవో రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.  గురువారం వేపరాల గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో మైలవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్ర, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ గౌసియాబి, ఆరోగ్య , అంగన్‌వాడి సిబ్బంది పాల్గొన్నారు.

ఎర్రగుంట్లలో: ప్రతి గర్భిణీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించుకోవాలని నగరపంచాయతీ ఛైర్మన్‌, కమిషనర్‌ మూలె హర్షవర్దన్‌రెడ్డి, పి.జగన్నాథ్‌లు పిలుపునిచ్చారు.  గురువారం ఎర్రగుంట్లలో ఆరోగ్యసిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగిరెడ్డి, ఎరికలరెడ్డి, రామాంజనేయులు, కో ఆప్షన్‌ సభ్యులు రఫీ, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, సీనియర్‌ అసిస్టెంట్‌ గంగిరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-30T04:59:42+05:30 IST