రేపటి నుంచి మోతీమాత జాతర

ABN , First Publish Date - 2022-01-15T04:53:13+05:30 IST

మొగుడంపల్లి మండలంలో గల జాంగార్‌బౌడి తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఉప్పర్‌పల్లి తండాలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవమైన మోతీమాత అమ్మవారి 27వ జాతరను ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు.

రేపటి నుంచి మోతీమాత జాతర
మోతీమాత అమ్మవారి ఆలయం

జహీరాబాద్‌, జనవరి 14: మొగుడంపల్లి మండలంలో గల జాంగార్‌బౌడి తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఉప్పర్‌పల్లి తండాలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవమైన మోతీమాత అమ్మవారి 27వ జాతరను ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్‌ వీర్‌శెట్టి చౌహన్‌, నిర్వాహకులు తెలిపారు. ఈనెల 16న ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, మహా మంగళహారతితో పాటు గిరిజన మహిళలతో అమ్మవారికి ప్రత్యేక నైవేద్య నివేదన, ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే 17న ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, రాత్రి 10 గంటలకు ప్రత్యేక భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. జాతరకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు అమ్మవారి జాతరకు హాజరుకానున్నారు.

Updated Date - 2022-01-15T04:53:13+05:30 IST