అంబేడ్కర్‌‌కు నిజమైన వారసుడు కేసీఆర్ : మోత్కుపల్లి

ABN , First Publish Date - 2021-07-23T18:37:43+05:30 IST

బీజేపీ పార్టీకి మోత్కుపల్లి నరసింహులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన

అంబేడ్కర్‌‌కు నిజమైన వారసుడు కేసీఆర్ : మోత్కుపల్లి

హైదరాబాద్: బీజేపీ పార్టీకి మోత్కుపల్లి నరసింహులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ, మాజీమంత్రి ఈటలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. అంబేడ్కర్‌‌కు నిజమైన వారసుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. దళితులకు పది లక్షలు ఇస్తోన్న ఏకైక మగాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పారు. రాష్ట్రంలోని దళితులందరూ కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అవమానాలు భరించలేకనే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని మోత్కుపల్లి తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఏ నాయకుడు బీజేపీలో సంతృప్తిగా లేరన్నారు. పార్టీ సమావేశాల్లో 30ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న తనను వేదిక కింద కూర్చో పెడుతున్నారని అన్నారు.


బలుపెక్కి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ను బీజేపీ మోయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. అవినీతిపరుడైన ఈటల రాజేందర్‌ను హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలని అన్నారు. దళిత, దేవలయాల భూములను వెనక్కి ఇప్పించి పార్టీలో చేర్చుకుంటే బాగుండేదని హితవుపలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి దళిత సాధికారత సమావేశానికి ఆహ్వినిస్తే వెళ్తే తప్పేంటి అని ప్రశ్నించారు. చరిత్రాత్మకమైన దళిత సాధికారత సమావేశానికి హాజరుకాకుండా బీజేపీ చారిత్రాత్మమైన తప్పుచేసిందని మోత్కుపల్లి నరసింహులు అన్నారు.

Updated Date - 2021-07-23T18:37:43+05:30 IST