Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇండియాలో లాంచ్ అయిన ‘మోటో జి31’.. ధర ఎంతంటే?

న్యూఢిల్లీ: భారత మొబైల్ మార్కెట్లోకి మరో ఫోన్ వచ్చేసింది. మోటొరోలా తన తాజా ఫోన్ ‘మోటో జి31’ను లాంచ్ చేసింది. మీడియా టెక్ ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా, మీడియా టెక్ హీలియో జి85 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లతో దీనిని తీసుకొచ్చింది.


ఈ ఫోన్‌లో ఆకట్టుకునే మరో ముఖ్యమైన ఫీచర్ కెమెరా. ఇందులో 50 మెగాపిక్సల్ కెమెరాను ఉపయోగించింది. రెండు రంగుల్లో తీసుకొచ్చిన మోటో జి31లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉండడం గమనార్హం. ఒకసారి చార్జ్ చేస్తే 36 గంటల వరకు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.  


మోటో జి31 4జీబీ ర్యామ్+64జీబీ వేరియంట్ ధర భారత్‌లో రూ. 12,999 కాగా, 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 14,999 మాత్రమే. డిసెంబరు 6వ తేదీ నుంచి ఫ్లిఫ్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. 


మోటో జి31 స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 11 స్టాక్ సాఫ్ట్‌వేర్‌తో ఇది పనిచేస్తుంది. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో+నానో/మైక్రో ఎస్డీ), 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ హోల్ పంచ్ డిస్‌ప్లే, మీడియా టెక్ హీలియో జి85 ఎస్ఓసీ, 1 టీబీ వరకు మెమొరీని పెంచుకునే అవకాశం, 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్స్ టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. 

Advertisement
Advertisement