Abn logo
May 25 2020 @ 20:23PM

అర్ధరాత్రి నుంచి సేల్‌కు ‘మోటొరోలా ఎడ్జ్ ప్లస్’.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు!

న్యూఢిల్లీ: నేటి అర్ధరాత్రి నుంచి మోటొరోలా ఎడ్జ్ ప్లస్’ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. రెండు కలర్  ఆప్షన్లు ఉన్న ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న వారు తప్ప మిగతా అందరూ ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెల 19న ఈ ఫోన్ విడుదల కాగా, అదే రోజు నుంచి ప్రీబుకింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి.  


మోటొరోలా ఎడ్జ్ ప్లస్ ధర రూ. 74,999 మాత్రమే. 12 జీబీ ర్యామ్, 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మేజర్ ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్‌కార్టులో కొనుగోలు చేసే వారికి రూ.7,500 రాయితీ లభిస్తుంది. అలాగే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్స్ ఈఎంఐ లావాదేవీలపైనా తక్షణ డిస్కౌంట్లు లభిస్తాయి.  


మోటొరోలా ఎడ్జ్ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు: సింగిల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ ‘ఎండ్‌లెస్ ఎడ్జ్’ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 108 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 25 ఎంపీ కెమెరా,  5జీ సపోర్ట్, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీ పెంచుకునే వెసులుబాటు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి.  

Advertisement
Advertisement
Advertisement