Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్రాక్టర్‌ను ఢీకొని మోటారుసైకిలిస్టు దుర్మరణం

దొరవారిసత్రం, డిసెంబరు 3 : మండలంలోని ఎన్‌ఎం అగ్రహారం వద్ద జాతీయరహదారిపై శుక్రవారం రాత్రి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో  మోటారు సైకిలిస్టు దుర్మరణం చెందాడు. మండలంలోని ఏకొల్లు గ్రామానికి చెందిన లేబాక రవి(45) బేల్దారి కూలీ. సూళ్లూరుపేటకు ఉదయం పనికి బైక్‌ వెళ్లిన రవి రాత్రి స్వగ్రాగామానికి వస్తున్నాడు. చీకటిలో సరిగా కనిపించకపోవడంతో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి రహదారిపై పడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

Advertisement
Advertisement