పరిశోధనశాలలో మహిళను కరిచిన కరోనా ఎలుక.. చివరికి..

ABN , First Publish Date - 2021-12-11T02:38:07+05:30 IST

ఓ ఎలుక కారణంగా తైవాన్‌లో దాదాపు నెల రోజుల తరువాత మళ్లీ ఓ కరోనా కేసు నమోదైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలు కలిగిన ఓ పరిశోధనశాలలో కరోనా బారిన పడ్డ ఓ ఎలుక

పరిశోధనశాలలో మహిళను కరిచిన కరోనా ఎలుక.. చివరికి..

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఎలుక కారణంగా తైవాన్‌లో దాదాపు నెల రోజుల తరువాత మళ్లీ ఓ కరోనా కేసు నమోదైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన ఓ పరిశోధనశాలలో కరోనా బారిన పడ్డ ఓ ఎలుక ప్రమాదవశాత్తూ అక్కడే పని చేసే ఓ మహిళా వర్కర్‌ను కరిచినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కరోనా ఎలుకపై అక్కడి శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు రెండు సార్లు ఆ కరోనా ఎలుక ఆమెను కరిచిందని సమాచారం. దీంతో.. ఆమె కరోనా బారిన పడింది. అయితే.. ఎలుక కరవడం వల్లే కరోనా సోకిందా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టు తైవాన్ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు. సదరు వర్కర్ నెలరోజులుగా విదేశీ ప్రయాణాలేవీ చేయలేదని సమాచారం. దీంతో.. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. 


Updated Date - 2021-12-11T02:38:07+05:30 IST