విజయగర్జన సభకు భారీగా తరలివెళ్లాలి

ABN , First Publish Date - 2021-10-24T05:01:27+05:30 IST

విజయగర్జన సభకు భారీగా తరలివెళ్లాలి

విజయగర్జన సభకు భారీగా తరలివెళ్లాలి
విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి/ఇబ్రహీంపట్న/యాచారం/ఆమనగల్లు/ఆదిభట్ల: వరంగల్‌లో నవంబర్‌ 15న జరిగే విజయగర్జన సభకు గ్రామాల నుంచి పార్టీ శ్రేణులను తరలించే బాధ్యత సర్ప ంచ్‌లు, గ్రామ కమిటీ అధ్యక్షులదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం శంకర్‌పల్లిలోని మణిగార్డెన్‌లో టిఆర్‌ఎస్‌ నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. యాదయ్య మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. వరంగల్‌లో జరిగే టీఆర్‌ఎస్‌ విజయగర్జన సభకు ప్రతీ గ్రామం నుంచి ఒక బస్సు నిండా జనం తరలాలన్నారు. ఎంపీపీ గోవర్థన్‌రెడ్డి, మున్సిపల చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌కూమార్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, మండల అధ్యక్షుడు గోపాల్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు వాసుదేవ్‌ కన్నా, సర్పంచ్‌ నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు శ్రీనాథ్‌గౌడ్‌, శ్వేతపాండురంగారెడ్డి, లక్ష్మమ్మరాంరెడ్డి, అశోక్‌, సంతో్‌షరాథోడ్‌,  ఫరీద్‌, శోభసుధాకర్‌రెడ్డి, అనితారావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిదని, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ పాలన ఉందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్‌, నాయకుడు వెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలోటీ ఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ భవిష్యత్‌ ఉంటుందన్నారు. 25న ప్లీనరీ, నవంబర్‌ 15న వరంగల్‌లో ఆవిర్భావ సభకు భారీగా జనసమీకరణ చేయాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ కప్పరి స్రవంతి, కౌన్సిలర్లు భాను, జగన్‌, సుధాకర్‌, జెర్కోని బాలరాజు, శ్రీలత పాల్గొన్నారు. టీఆర్‌ఎ్‌సకు కార్యకర్తలే అధిష్టానమని, వారి అభిప్రాయం మేరకే నడుచుకుంటామని యాచారం మండల టీఆర్‌ఎ స్‌ అధ్యక్షకార్యదర్శులు కె.రమే్‌షగౌడ్‌, పి.బాషా అన్నారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 70ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ చేయలేని అభివృద్ధి ఏడేళ్లలో టీఆర్‌ఎస్‌ చేసిందన్నారు. వరంగల్‌ సభకు నాయకులు కార్లలో కాకుండా కేవలం ఆర్టీసీ బస్సుల్లోనే రావాలన్నారు. మాల్‌లో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యే నిధులు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. సొసైటీ చైర్మన్‌ టి.రాజేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ కె.యాదయ్య, ఎన్‌.సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘ అధ్యక్షురాలు ఉదయశ్రీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పార్టీ ప్రటిష్టతకు కార్యకర్తలు కృషిచేయాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. విజయగర్జన సభకు జనసమీకరణ సన్నద్ధతలో భాగంగా ఆదిభట్ల పరిధి జేబి రిసార్టులో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పెద్దఎత్తున నిధులు తెచ్చి నియోజవవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కార్యక్ర మంలో పార్టీ మున్సిపల్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, వైస్‌చైర్మన్‌ కోరె కళమ్మ, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, మహేందర్‌, కృష్ణ ంరాజు, మౌనిక, సంధ్య, జంగయ్య, గోపాల్‌గౌడ్‌, జగదీష్‌, శ్రీనివా్‌సగౌడ్‌, పి.రవీందర్‌ పాల్గొన్నారు.


  • నేడు కార్యకర్తల సమావేశం

ఆమనగల్లు: మండల, మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ఆమనగల్లులోని వాసవి పంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు పొనుగోటీ అర్జున్‌రావు, నెనావత్‌ పత్యనాయక్‌, వైస్‌ఎంపీపీ అనంతరెడ్డి శనివారం తెలిపారు. 25న నిర్వహించే టీఆర్‌ఎ్‌స్‌ ప్లీనరి, నవంబర్‌ 15న నిర్వహించే విజయగర్జన సభ విజయవంతం గురించి సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ హాజరవుతారని తెలిపారు. సయ్యద్‌ ఖలీల్‌, గుత్తి బాలస్వామి, కుమార్‌, జయరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:01:27+05:30 IST