మహిళా గర్జనకు భారీగా తరలిరండి
ABN , First Publish Date - 2021-10-25T06:00:54+05:30 IST
ఉక్కు పరిరక్షణకు ఈ నెల 27న తలపెట్టిన మహిళా గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌లోని చర్చిల వద్ద ఆదివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ప్రతినిధులు ప్రచారం చేశారు.
ఉక్కుటౌన్‌షిప్, అక్టోబరు 24: ఉక్కు పరిరక్షణకు ఈ నెల 27న తలపెట్టిన మహిళా గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌లోని చర్చిల వద్ద ఆదివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ప్రతినిధులు ప్రచారం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంకు వ్యతిరేకంగా మహిళా గర్జన నిర్వహిస్తున్నామని, ఈ గర్జనతో కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వై.వరలక్ష్మి, కె.విమల, అడుసుమల్లి దీప్తి, కె.వేణు, పద్మ, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.