రేపట్నుంటి ఉద్యమ బాట : ఏపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-10-18T06:14:07+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నుంచి ఆదివారం వరకూ (ఆరు రోజుల పాటు) విజయవాడలో ధ ర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్‌ నాయకులు తెలిపారు.

రేపట్నుంటి ఉద్యమ బాట : ఏపీటీఎఫ్‌
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

అనంతపురం విద్య, అక్టోబరు 17 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నుంచి ఆదివారం వరకూ (ఆరు రోజుల పాటు) విజయవాడలో ధ ర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్‌ నాయకులు తెలిపారు. ఆదివారం ఉపాధ్యాయభవన్‌లో ఆ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు మాట్లాడారు. రెండున్నరేళ్లు గడిచినా... టీచర్ల సమస్యలు పరిష్కారం కాలేదని, అందుకే ఉద్యమించాల్సి వస్తోందని అన్నారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, యాప్‌ భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  2018 జులై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ, ఐదు డీఏ బకాయిల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎదురుచూపులే మిగిలాయన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, సర్వీసు రూల్స్‌ సమస్యలను పరిష్కరించాలని, మండల విద్యాశాఖాధికారులు, డీవైఈఓ పో స్టులు, డైట్‌ లెక్చరర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప మాట్లాడుతూ.... ప్రైమరీ స్కూళ్లను విభజించి 3,4,5 క్లాసులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్నీ సమాంతరంగా కొనసాగించాలన్నారు. ఎయిడెడ్‌ విలీన ప్రక్రియలో ఎయిడెడ్‌ టీచర్లను పోస్టులతో సహా బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు సిరాజుద్దీన్‌, బొ మ్మయ్య, రామకృష్ణ, సూర్యనారాయణ, సర్ధార్‌వలి, రమణ, రామప్ప, ధనుంజయ, నరే్‌షకుమార్‌, రవి, నారాయణస్వామి, బాలకదిరప్ప, నజీర్‌ పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-18T06:14:07+05:30 IST