అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

ABN , First Publish Date - 2022-01-21T04:46:40+05:30 IST

పీఆర్‌సీపై కలెక్టరేట్‌ ముట్టడికి ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చిన సందర్భంగా ముందస్తుగా గురువారం ఉదయం ఉద్యమ నాయకులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు
ఉపాధ్యాయ నేతలను పోలీ్‌సస్టేషన్‌కు తరలిస్తున్న ఎస్‌ఐ

రాజంపేట, జనవరి 20: పీఆర్‌సీపై కలెక్టరేట్‌ ముట్టడికి ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చిన సందర్భంగా ముందస్తుగా గురువారం ఉదయం ఉద్యమ నాయకులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా యూటీఎఫ్‌ అధ్యక్షుడు హరిప్రసాద్‌, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సి.రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు కడపకు వెళ్లడానికి వీలుపడలేదు. ఈ విధంగా ఉద్యమ నేతలను అదుపులోకి తీసుకొని ఉద్యమాన్ని అణచివేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు.


అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

సుండుపల్లె, జనవరి 20: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఫ్యాప్టో పిలుపుమేరకు కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి హాజరుకానున్న ఎస్టీయూ మండల నాయకులను ఉదయాన్నే అరెస్టు చేశారు. ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు రవీంద్రారెడ్డి, అరిఫుల్లా, నాగరాజనాయక్‌, ఇస్మాయిల్‌, గణపతి, బీమ్లానాయక్‌, మణికంఠ, వెంకటరమణనాయక్‌లను ముందస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. జీతాలు కోత పెట్టే పీఆర్సీ మాకు వద్దు, పీఆర్సీ అర్ధరాత్రి చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలని నినదించారు. అశోతోష్‌ మిశ్రా రిపోర్ట్‌ని బయటపెట్టాలని, ఐఆర్‌ 27శాతం కంటే ఫిట్‌మెంట్‌ ఎక్కువ ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఏ పాత స్లా బులు కొనసాగించాలని, సీపీఎస్‌ రద్దు చేయా లని, ఓపీఎస్‌ ఇవ్వాలని, సచివాలయ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.


గురువులను పోలీస్‌ స్టేషన్లో బందిస్తారా..?

జనసేన విమర్శ

రైల్వేకోడూరు, జనవరి 20: చదువు చెప్పే గురువులను పోలీ్‌సస్టేషన్లో బందిస్తారా అని రైల్వేకోడూరు జనసేన నాయకుడు మర్రిరెడ్డి ప్రసాద్‌ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు తమ పోరాటాన్ని సమైక్యంగా చేయాలని కోరారు. పే రివిజన్‌ కమీషన్‌ అనే పేరును కాస్త పే రివర్స్‌ కమిషన్‌ గా మార్చిన ఘనత జగన్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసుల జీతాల్లో తగ్గించే విధంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. ఉద్యోగుల పోరాటాన్ని అణిచి వేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో నియంతృత్య పాలన నడుస్తోందన్నారు. 


కలెక్టరేట్‌ ముట్టడి విజయంతం 

సంబేపల్లె, జనవరి 20: ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పీఆర్‌సీపై గురువారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం విజయవంతమైం దని సంబేపల్లె మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు తెలిపారు. జనసందోహం మధ్య పీఆర్‌సీపై ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టారన్నారు. నిస్సహాయుల్ని చేసి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందన్నారు. అధికారుల తప్పుడు నివేదికలను ప్రభుత్వం గుడ్డిగా నమ్మి ఉపాధ్యాయ వర్గాన్ని దూరం చేసుకోవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో రామాంజు లు, రెడ్డెయ్యరాజు, చంద్రశేఖర్‌రాజు, గంగిరెడ్డి, ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:46:40+05:30 IST