సినీ హీరో రామ్‌చరణ్‌ అభిమాని పాదయాత్ర

ABN , First Publish Date - 2021-06-21T05:09:40+05:30 IST

సినీ హీరో రామ్‌చరణ్‌ను కలి సేందుకు ఓ యువ కుడు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టా డు.

సినీ హీరో రామ్‌చరణ్‌ అభిమాని పాదయాత్ర
రోడ్డుపై పాదయాత్రగా వెళుతున్న దృశ్యం

గద్వాల రూరల్‌, జూన్‌ 20 : సినీ హీరో రామ్‌చరణ్‌ను కలి సేందుకు ఓ యువ కుడు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టా డు. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెంది న సంధ్యా జయరాజ్‌ ఆదివారం జముల మ్మ ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈయన షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా, రైటర్‌గా చిన్న చిన్న సన్నివేశాలు తీస్తున్నాడు. ప్రస్తుతం తన వద్ద ఓ కథ ఉందని, దానికి సంబంధించిన సన్నివేశాలపై చర్చించేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. తాను రామ్‌చరణ్‌కు వీరాభిమానినని, 2007లో రామ్‌చరణ్‌ తీసిన చిరుత సినిమా ఫస్ట్‌ లుకింగ్‌ పెయింటింగ్‌ను ఆయన నివాసంలో కలిసి గిఫ్ట్‌గా ఇచ్చానని అన్నారు. ఐదు రోజులపాటు 226 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయనను కలుస్తానని తెలిపారు.

Updated Date - 2021-06-21T05:09:40+05:30 IST