ప్రాథమిక తరగతుల తరలింపు తగదు

ABN , First Publish Date - 2021-06-15T05:58:39+05:30 IST

పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది.

ప్రాథమిక తరగతుల తరలింపు తగదు
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు

ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ 

విశాఖపట్నం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ జిల్లా కన్వీనర్‌ జి.మధు మాట్లాడుతూ రాష్ట్రంలో 34 వేల ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను మూడు నుంచి ఐదు కిలో మీటర్ల పరిధిలో ఉన్న యూపీ, ఉన్నత పాఠశాలలకు తరలించే చర్య విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ బడులను కుదించి టీచర్‌ పోస్టులను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. నిరసన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంకటపతిరాజు, ఏఎస్‌ నాయుడు, పూజారి సత్యనారాయణ, ఎ. ధరేంద్రరెడ్డి, కేఎస్‌ఎన్‌ సాయిప్రసాద్‌, రామకృష్ణ, నూకరాజు, వీరభద్రరావు, నాగరాజు తదితరులు ఉన్నారు. ఇదే అంశంపై ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ ఇ. పైడిరాజు నేతృత్వంలో బృందం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-06-15T05:58:39+05:30 IST