ఎంపీ బండి సంజయ్‌వి దిగజారుడు రాజకీయాలు

ABN , First Publish Date - 2020-09-23T06:19:16+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇచ్చింది 200 కోట్లతై ఏడు వేల కోట్లు అని ఎంపీ బండి సంజయ్‌ అబద్దమాడుతున్నారని, దిగ జారుడు

ఎంపీ బండి సంజయ్‌వి దిగజారుడు రాజకీయాలు

కొవిడ్‌ నిధులపై కరీంనగర్‌లో చర్చకు సిద్ధం 

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌


చొప్పదండి, సెప్టెంబరు 22: కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇచ్చింది 200 కోట్లతై ఏడు వేల కోట్లు అని ఎంపీ బండి సంజయ్‌ అబద్దమాడుతున్నారని, దిగ జారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టానికి ఇచ్చిన నిధులపై కరీంనగర్‌ తెలంగాణచౌక్‌లో చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఎంపీకి లే దని, అబద్ధాలు మాట్లాడటం ఆపి రైల్వే సమస్యలను పరిష్కరించి నూతన బ్రిడ్జిలు మంజూరు చేయించా లన్నారు. అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బండి సంజయ్‌ అని అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ర్టానికి కరోనా నేపథ్యంలో ఎన్ని నిధులు కేటా యించారని అడిగిన ప్రశ్నకు 200 కో ట్లు అని సమాధానం ఇచ్చారని, కేం ద్రం ఏడు వేల కోట్లు ఇచ్చిందని ప్రజ లకు అబద్ధాలు చెబుతున్నారని అన్నా రు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లిస్తే అవి కేంద్రం ఇచ్చే డబ్బులని, జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నా వాటిని పట్టించుకో వడం లేదన్నారు.  సమావేశంలో ఎంపీపీ చిలుక రవీందర్‌, మార్కెట్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు బందారపు అజయ్‌ పాల్గొన్నారు.

 

రైతు బీమాతో కుటుంబాలకు ధీమా

గంగాధర: రైతు కుటుంబాలకు ధీమా కల్పించేం దుకు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పె ట్టారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మంగళవారం గంగాధర మండలం ర్యాలపల్లికి చెంది న తొందుర్తి సుధాకర్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన పేరున భూమి ఉండడంతో ప్రభు త్వం ఇన్సూరెన్స్‌ చేయించగా రైతు బీమా మంజూరైం ది. ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల బీమా ప్రొసీడింగ్‌ను మంగళవారం సుధాకర్‌ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందించారు. ఆయన వెంట సర్పంచ్‌ పానుగంటి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, మార్కెట్‌ చై ర్మన్‌ సాగి మహిపాల్‌రా వు, గంగాధర సింగిల్‌ విం డో అధ్యక్షుడు దూలం బా లాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్‌ రావు, రైతు సమన్వయ స మితి మండల అధ్య క్షుడు పుల్కం గంగన్న, నాయకు లు పుల్కం నర్సయ్య, దానే ఓదేలు, శేఖర్‌రెడ్డి ఉన్నారు

Updated Date - 2020-09-23T06:19:16+05:30 IST