Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఎంపీ భరత్ కౌంటర్

రాజమండ్రి: రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నా తమ్ముడు భరత్ అని ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలు నాకు చాలు. టిడిపి నేతలు బుచ్చయ్యతో,  పెందుర్తి వెంకటేష్‌తో నేను కుమ్మక్కయ్యానని సాక్ష్యాలు ఉంటే బయట పెట్టు’’ అని సవాల్ విసిరారు. ‘‘నీలా నేను చీకటి రాజకీయాలు చెయ్యను, నువ్వు చేసే ప్రతి విషయం స్కూల్‌కి వెళ్లే పిల్లవాడిని అడిగితే చెప్తాడు’’ అని అన్నారు. జేడి లక్ష్మీనారాయణతో ఒక ప్రోగ్రాంలో మాత్రమే కలిశానపి, తాను సెల్ఫీ దిగితే ఫూటేజ్ చెక్ చేసుకోవాలని తెలిపారు.  సీఎం జగన్ పరిపాలనను జేడి ప్రశంసించారన్నారు. ట్రిపుర్ ఆర్‌లా తనకు నీచ రాజకీయాలు రావని...తనను రఘురామకృష్ణంరాజుతో పోల్చడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.


తాను సోషల్ మీడియాలో కనిపిస్తున్నానని తనమీద పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రధానులకు ఫోన్ చేసి ఆయన ఏ బాషలో మాట్లాడతారో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. ఆయన  చిటికేస్తే రాజమండ్రిలో వచ్చేది బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్లు, గంజాయి బ్యాచ్ అని విమర్శించారు. తనకు పార్టీ ఇచ్చిన లక్ష్మణ గీత దాటనని.. తమరు తమ పరధిలో ఉంటే మంచిదని హితవుపలికారు. పార్టీ ఇచ్చిన లక్ష్మణ గీత ను దాటితే.. రెండు రాష్ట్రాల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. ‘‘నీలాగే నేను కూడా కిడ్‌లా ప్రవర్తిస్తే నీకు నాకు తేడా ఉండదు’’ అని ఎంపీ భరత్ వ్యాఖ్యలు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement