Abn logo
Sep 18 2020 @ 18:18PM

రైతుల ఖాతాల్లో ఫసల్ బీమా నగదు వేసిన సీఎం చౌహాన్

Kaakateeya

భోపాల్: మధ్యప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫసల్ బీమా యోజన (పంట బీమా) మొత్తాలను చెల్లించారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వీటిని జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొంత మంది రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్టాడారు.


‘‘4,600 కోట్ల రూపాయల మొత్తాన్ని 22 లక్షల రైతుల ఖాతాల్లో జమచేయడం చారిత్రాత్మక విషయం’’ అని శివరాజ్ సింగ్ అన్నారు. అంతే కాకుండా ఇదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల పలు సూచనలు, అనుభవాలను ప్రభుత్వం నమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement