పార్టీని చూసి పరిహారమా?

ABN , First Publish Date - 2020-10-25T10:05:09+05:30 IST

అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌పై ఉందని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు.

పార్టీని చూసి పరిహారమా?

ఎంపీ గల్లా జయదేవ్‌ ధ్వజం  


 కొల్లిపర, దుగ్గిరాల, అక్టోబరు 24 : అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌పై ఉందని ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. శనివారం మండలం కొత్తూరులంక, అన్నవరంలంక గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన పర్యటించారు. అదే విధంగా దుగ్గిరాల మండలంలో గొడవర్రు, పెదకొండూరు గ్రామాల్లో లంక ప్రాంతంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ లేక మరో పార్టీనా అని రైతులను విభజించడం మంచి పరిణామం కాదన్నారు.


ముఖ్యమంత్రి ప్రజలకు గానీ పార్టీకీ కాదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కలెక్టర్‌ను కలిసి ముంపు ప్రాంతాల్లో నష్టపరిహారం గురించి తాను అడిగినట్లు తెలిపారు.  రైతులకు నష్టపరిహారాన్ని సమానంగా ఇవ్వాలని లేని పక్షంలో రైతుల తరఫున పోరాటం చేస్తామని డిమాండ్‌ చేశారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల పొట్టకొట్టేలా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ 20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో సినీనటి దివ్యవాణి, టీడీపీ పార్లమెంటరీ మహిళా ఇన్‌చార్జి అన్నాబత్తిన జయలక్ష్మి, టీడీపీ మండల అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి కంచర్ల అమృతరాజు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవి, గూడూరు వెంకట్రావు, కొల్లి కోటిరెడ్డి, మోర్ల శ్రీను, బొంతు చంద్రిక,  మొవ్వా రాజా, తాతా అంజనేయులు, తాతా శివయ్య, పందిపాటి నల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T10:05:09+05:30 IST