Abn logo
Sep 20 2021 @ 19:41PM

వీలైతే ప్రధానమంత్రి, హోమంత్రిని కలుస్తాము: కనకమేడల

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడారు. ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి చేసిన సంఘటనపై ఫిర్యాదు చేశానని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి వీడియో క్లిప్పింగ్స్ సహ చూపించడం జరిగిందన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాయకుడిపై దౌర్జన్యం జరగకుండా పోలీసులు ఆపలేదన్నారు. జరిగాక చర్యలు కూడా తీసుకోలేదన్నారు. ‘‘పోలీసులు ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని. పోలీసులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల లాగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు దాడిని చేసిన వారిపై కాకుండా టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. పక్షపాతం గా వ్యవహరిస్తున్న పోలీసులుపై అవసరమైతే కేంద్ర సిబ్బంది వ్యహరాల మంత్రుత్వ శాఖకు పిర్యాదు చేస్తాము. మా ఫిర్యాదును హోమ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి  పరిశీలించారు. పోలీసులు ఉదాసీన వైఖరి వల్ల ఇలానే జరిగింది అని చెప్పాను. తగిన విచారణ జరిపి ఇతర ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, హోమ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి చెప్పారు.కేంద్రహోంశాఖ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాము. వీలైతే ప్రధానమంత్రి, హోమంత్రిని కలుస్తాము.’’ అని కనకమేడల వ్యాఖ్యానించారు.