Abn logo
Jun 11 2021 @ 15:49PM

కేసులపై ఒత్తిడి తోనే జగన్ ఢిల్లీ టూర్: కనకమేడల

ఢిల్లీ: సీఎం జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్టాన్ని తాకట్టు పెట్టొద్దని తెలుగుగేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్‌ కేసులపై ఒత్తిడి వచ్చినప్పుడల్లా ఢిల్లీ టూర్ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులకు ఇచ్చిన నోట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు ఏం చెప్పారో ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంలో కేంద్రం వెనక్కి వెళ్లదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసునని కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. 

Advertisement