Abn logo
Sep 9 2021 @ 18:48PM

ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: మానుకోట ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. మానుకోట ఎంపీ కవిత కేసును హైకోర్టు కొట్టివేసింది. 2019లో ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారని కవితపై కేసు నమోదైంది. ఎంపీ కవితకు ఇటీవలే 6 నెలల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా ప్రజాప్రతినిధుల కోర్టు విధించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై ఎంపీ కవిత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఎంపీ కవిత కేసును హైకోర్టు కొట్టివేసింది.