‘కేశినేని’ పేరుతో మోసాలు.. కృష్ణలంక పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-09-23T16:46:56+05:30 IST

ఎంపీ కేశినేని నాని ఇంటి పేరు కలిసి రావటంతో అదే పేరును ఉపయోగించుకుని..

‘కేశినేని’ పేరుతో మోసాలు.. కృష్ణలంక పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఎంపీ కేశినేని నాని ఇంటి పేరు కలిసి రావటంతో అదే పేరును ఉపయోగించుకుని కేశినేని రమేష్‌ అలియాస్‌ నాని అనే వ్యక్తి పలువురికి టోకరా వేశాడు. దీనిపై కృష్ణలంకకు చెందిన కల్పన ప్రింటర్స్‌ యజమానితో పాటు, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కార్ల కొనుగోలు, విక్రయాలు చేసే వ్యాపారి కృష్ణ లంక పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. నూజివీడు ప్రాం తానికి చెందిన కేశినేని రమేష్‌ (నాని) స్థానిక గేట్‌వేలో 607వ నంబర్‌ రూమ్‌ను అద్దెకు తీసుకుని ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాడు. ఓ మహిళ ద్వారా తాడేపల్లికి చెందిన కార్ల వ్యాపారితో పరిచయం పెంచు కున్న రమేష్‌ అతడికి కార్లు అమ్మేవాడు.


ఆ వ్యాపారితో సన్నిహితంగా మెలుగుతూ జూలై 25న ఆ వ్యాపారి వద్ద రూ.4.50 లక్షలను వడ్డీకి తీసు కుని బదులుగా రెండు చెక్కులు ఇచ్చాడు. తరువాత చెక్కులు బౌన్స్‌ అవటంతో రెండు,మూడు రోజుల్లో డబ్బులు సర్దుబాటు చేస్తానన్న రమేష్‌ కనిపించడం మానేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.

Updated Date - 2020-09-23T16:46:56+05:30 IST