ఇద్దరు భార్యలతో లైవ్‌లో అలా దొరికాడు...

ABN , First Publish Date - 2020-10-26T14:37:54+05:30 IST

డబ్బులకు కక్కుర్తి పడిన ఓ భర్త తన ఇద్దరు భార్యలతో పడకగదిలో గడిపిన దృశ్యాలను...

ఇద్దరు భార్యలతో లైవ్‌లో అలా దొరికాడు...

భోపాల్(మధ్యప్రదేశ్): డబ్బులకు కక్కుర్తి పడిన ఓ భర్త తన ఇద్దరు భార్యలతో పడకగదిలో గడిపిన దృశ్యాలను  లైవ్ స్ట్రీమ్ చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. విదీషా పట్టణానికి చెందిన ఓ భర్త తన ఇద్దరు భార్యలతో జరిపిన శృంగార వీడియోలను పలు యాప్ లలో అశ్లీల వెబ్ సైట్ల ద్వారా లైవ్ స్ట్రీమ్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. విదీషా పట్టణానికి  చెందిన 24 ఏళ్ల యువకుడు పదోతరగతి వరకే చదివినా తనకున్న సాంకేతికతతో పలు డేటింగ్ యాప్ లు, సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవాడు. ఇద్దరు యువతులను మోసం చేసి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.



డెమో కోసం వందరూపాయల చార్జీ

నిందితుడు పలు అడల్ట్ యాప్ లలో ఖాతాలు తెరిచి, డీపీని లైక్ చేయగానే వారికి డెమో కోసం వందరూపాయలు చెల్లించాలనే మెసేజ్ వెళుతుందని పోలీసులు చెప్పారు. అందులో తన ఇద్దరు భార్యలతో జరిపిన శృంగార వీడియోలు కనిపిస్తాయి. నచ్చినవారు  వాటిని చూడాలంటే అదనపు చార్జీలుంటాయి. భార్యలతో పడకగది దృశ్యాల వీడియోలను లైవ్ స్ట్రీమ్ చేసి నిందితుడు డబ్బు సంపాదించాడని పోలీసులు చెప్పారు. ఫేస్ లెస్, ఫేస్ స్ట్రీమింగ్ లతో వేర్వేరు చార్జీలు పెట్టాడని పోలీసులు చెప్పారు.నిందితుడి ఒక భార్య 7 నెలల గర్భవతి అని పోలీసులు చెప్పారు. నిందితుడు ఈ బాగోతం ఆగస్టు నుంచి సాగిస్తున్నాడని వారు చెప్పారు.నిందితుడి నుంచి రూ.15.5 లక్షల విలువైన బంగారం, రూ.45వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వికాస్ పాండే చెప్పారు. నిందితుడిపై ఐపీసీతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు.



రెండు వివాహాలు

 విదీషా యువకుడు సోషల్ మీడియా పరిచయంతో బెంగళూరుకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.మొదటి పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో యువతిని కూడా గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో శృంగారం చేస్తూ ఆయా దృశ్యాలను అశ్లీ యాప్ లలో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. భర్త పెట్టే వేధింపులు భరించలేని రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు భార్యలతో ఈ లైవ్ స్ట్రీమ్ శృంగార బాగోతం బయటపడింది. బెంగళూరుకు చెందిన భార్య అతనికి లొంగిపోయి అతని దుశ్చర్యలకు సహకరిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Updated Date - 2020-10-26T14:37:54+05:30 IST