నెహ్రూ వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-08-01T23:45:33+05:30 IST

నెహ్రూ వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి: కేంద్ర మంత్రి

నెహ్రూ వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి: కేంద్ర మంత్రి

భోపాల్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం భారత తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూనే అని మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ అన్నారు. శుక్రవారం ఆయన మధ్యప్రదేశ్‌లో మీడియాతో మాట్లాడుతూ స్వదేశీ సంస్కృతిని త్యజించడం వల్లనే దేశంలో ధరలు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విదేశాల్లో చదువుకున్న నెహ్రూ.. భారతీయ సంస్కృతిని తిరస్కరించారని, ఆయనపై విదేశీ సంస్కృతి ప్రభావం వల్లే ఆయన అలా చేశారని అన్నారు.


‘‘దేశాభివృద్ధి ఘనత అంతా నెహ్రూదేనని కాంగ్రెస్ నేతలు అంటుంటారు. మరి గ్రామాలు, వ్యవసాయం ఎందుకు వెనకబడి ఉందో చెప్పాలి. గాంధీ కుటుంబ పాలనలో ఆర్థిక విధానం గ్రామాలు, వ్యవసాయాన్ని ఎందుకు బాగు పర్చలేదో చెప్పాలి. నెహ్రూ విదేశాల్లో చదువుకున్నారు. ఆ సంస్కృతికి ప్రభావం చెందిన ఆయన మన సంస్కృతిని పక్కనపెట్టారు. దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. ఇది కాంగ్రెస్ పాలన కారణంగా వచ్చింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మా చేతిలో ఉండవు. ప్రపంచ మార్కెట్ విధానాలకు అనుగుణంగా ఉంటాయి. మేం వాటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో అనేకసార్లు ధరలను తగ్గించాం’’ అని విశ్వాస్ సారంగ్ అన్నారు.

Updated Date - 2021-08-01T23:45:33+05:30 IST