Kuwait పార్లమెంట్‌లో అద్భుత ప్రతిపాదన.. అమల్లోకి వస్తే ఉద్యోగులకు పండగే..

ABN , First Publish Date - 2021-11-19T17:29:19+05:30 IST

ఉద్యోగులు మరింత ఉత్తేజంగా పనిచేసేలా కువైత్ పార్లమెంట్‌లో ఓ అద్భుత ప్రతిపాదన చేశారు ఎంపీ ముహమ్మద్ అల్ హువాలియా.

Kuwait పార్లమెంట్‌లో అద్భుత ప్రతిపాదన.. అమల్లోకి వస్తే ఉద్యోగులకు పండగే..

కువైత్ సిటీ: ఉద్యోగులు మరింత ఉత్తేజంగా పనిచేసేలా కువైత్ పార్లమెంట్‌లో ఓ అద్భుత ప్రతిపాదన చేశారు ఎంపీ ముహమ్మద్ అల్ హువాలియా. వారానికి పనిదినాలు, గంటలపై ఈ ప్రతిపాదన చేశారాయన. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు వారానికి కేవలం 4 రోజులే పనిదినాలుగా ఉండాలని ఆయన ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగులు అలసట వీడి, మరింత నూతనోత్తేజతంతో పని చేస్తారని ఈ సందర్భంగా హువాలియా పేర్కొన్నారు. దాంతో ఆటోమెటిక్‌గా వారి పర్ఫామెన్స్ కూడా పెరుగుతుందన్నారు. దీనికారణంగా ఉద్యోగులు చాలా సులువుగా వారికి నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోగలరని తెలిపారు. అయితే, ఈ పనిదినాల తగ్గింపు ప్రభావం ఉద్యోగుల జీతాలు, అలవెన్సులపై ఎట్టిపరిస్థితిలో పడకూడదని ఆయన తన ప్రతిపాదనలో తెలియజేశారు. అలాగే చాలా రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు పార్ట్‌టైమ్ వర్క్ విషయమై కూడా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారని, ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని కువైత్ పార్లమెంట్ తగిన నిర్ణయం తీసుకోవాలని ఎంపీ హువాలియా తన ప్రతిపాదనలో పేర్కొన్నారు.     

Updated Date - 2021-11-19T17:29:19+05:30 IST