Abn logo
Jul 8 2020 @ 04:48AM

ధంసలాపురం ఆర్వోబీ పనులను త్వరగా పూర్తిచేయాలి

 రైల్వే జీఎంకు ఎంపీ నామా లేఖ


ఖమ్మంటౌన్‌, జూలై 7: ఖమ్మం-బోనకల్‌ రహదారిలో ఖాజీపేట-విజయవాడ జంక్షన్‌ల మధ్య ధంసలాపురం వ ద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను త్వర గా పూర్తిచేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళవారం దక్షిణమధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు. ఈ ఆర్వోబీ నిర్మాణం కోసం జిల్లాప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారని, నిర్మాణం పూర్తయితే విజయవాడ వెళ్లేందుకు రవాణా సులభమవుతుందన్నారు. ఆర్వోబీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ నిధులు కేటాయించింద ని, ప్రభుత్వం తరుపున 92 శాతం పనిపూర్తయిందని నామా జీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే రైల్వేశాఖకు సంబంధించిన పనులు త్వరగా పూర్తిచేసి ఆగస్టునాటికి ఆర్వోబీ ప్రారంభమయ్యేలా చూడాలని నామా కోరారు. 

Advertisement

ఖమ్మం మరిన్ని...

Advertisement