Abn logo
Sep 21 2021 @ 14:57PM

భరత్‌కు పక్క నియోజకవర్గం భాధ్యతలు అందుకే ఇచ్చారా?: ఎంపీ రఘురామ

ఢిల్లీ: మూడు రాజధానులుకు ప్రజలు జై కొట్టారని పరిషత్ ఎన్నికలు ఫలితాలు రుజువు చేశాయి అంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రోడ్లు వద్దు, ఉద్యోగాలు భర్తీ వద్దు, సిపిస్ రద్దు వద్దు అని, పరిశ్రమలు అభివృద్ధి వద్దు అని సహ జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు సమర్ధించినట్లా? అని ప్రశ్నించారు. తమ ముఖ్యమంత్రి  తాడేపల్లి నుండి కదలటం లేదు తాను ఢిల్లీ నుండి కదలడం లేదు మా ఇద్దరి పరిస్థితి ఒకటేనన్నారు. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టి వేయడంకు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామికి సంబంధం ఉందని తాను భావించడం లేదన్నారు. ప్రత్యేక కారణం లేకుండా సుబ్రమణ్యం స్వామి రారు.. కానీ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ గురించి అని తాను అనుకోవడం లేదన్నారు. ప్రత్యేక విమానంలో వచ్చేంత శక్తి సుబ్రహ్మణ్య స్వామికి లేదన్నారు. మార్గాని భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి  రాజా ఆరోపణలుపై సీఎం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చాలా కాలం క్రితం ఫిర్యాదు చేసినా ఏందుకు పట్టించు కోలేదని ప్రశ్నించారు. ఆవ భూములు, పురుషోత్తపట్నం పథకం భూములు కుంభకోణంలో కోట్లు దోసుకుంటుంటే అదే అర్హతగా భరత్‌కు పక్క నియోజకవర్గం భాధ్యతలు కుడా అందుకే ఇచ్చారా? అని ప్రశ్నించారు. 

ఇవి కూడా చదవండిImage Caption