ఘనంగా ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-09-19T05:15:33+05:30 IST

ఘనంగా ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
మహేశ్వరం: వడ్లతో తయారు చేసిన చిత్రపటం ఇచ్చి రంజిత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న తుమ్మలూరు మాజీ సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, నాయకులు

కందుకూరు/చేవెళ్ల/షాబాద్‌/మహేశ్వరం/చేవెళ్ల/శంషాబాద్‌ రూరల్‌: చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలు నగరంలోని ఆయన నివాసంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, జి.లక్ష్మీనర్సింహారెడ్డి, మూల హన్మంత్‌రెడ్డి, జి.సత్యనారాయణరెడ్డి, కె.శివరామకృష్ణారెడ్డి సత్యనారాయణ, మేఘనాథ్‌రెడ్డి ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఏర్పాటుచేసిన గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కార్యక్రమంలో రంజిత్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌తో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. అలాగే ఉదయం చేవెళ్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆల య పుష్కరిణి ఆవరణలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే ఎంపీకి కేక్‌ తినిపించారు. ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, టీఆర్‌ఎస్‌ యూత్‌ వింగ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ప్రభాకర్‌, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు శివారెడ్డి, నాయకులు రమణారెడ్డి, కృష్ణరెడ్డి, నరేందర్‌గౌడ్‌, మోసిన్‌, వెంకటేశ్‌, బి.నర్సింలు, మాణిక్యరెడ్డి, రాములు, రమేశ్‌రెడ్డి ఉన్నారు. షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి, టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పీసరి సతీ్‌షరెడ్డి ఎంపీని కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వరం మండలం తుమ్మలూరు మాజీ సర్పంచ్‌ మద్ది కరుణాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేకంగా వడ్లతో తయారుచేసిన ఎంపీ ఫొటోను బహూకరించారు. రంజిత్‌రెడ్డికి మహేశ్వరం మండలం మన్సాన్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ యువనాయకుడు మర్యాద రాఘవేందర్‌రెడ్డి ఎంపీ చిత్రపటాన్ని బహూకరించారు. రంజిత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో శంషాబాద్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే శంషాబాద్‌ జడ్పీటీసీ తన్వీరాజు, నాయకుడు ఆర్‌.గణే్‌షగుప్తా ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-09-19T05:15:33+05:30 IST