Abn logo
Oct 24 2021 @ 10:46AM

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ Santosh

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో రేపు జరగబోయే టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరి ఏర్పాట్లను ఎంపీ సంతోష్ కుమార్ పరిశీలించారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 20 సంవత్సరాల టీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని, ప్లీనరి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయని ఎంపీ అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ వెంట ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, టీఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర సీనియర్ టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...