అమిత్‌షాను కలిసిన ఎంపీ సోయం బాపురావు

ABN , First Publish Date - 2021-07-28T20:39:34+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఎంపీ సోయం బాపురావు కలిశారు. భైంసా అల్లర్లను అమిత్‌షాకు సోయం వివరించారు. అనంతరం

అమిత్‌షాను కలిసిన ఎంపీ సోయం బాపురావు

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఎంపీ సోయం బాపురావు కలిశారు. భైంసా అల్లర్లను అమిత్‌షాకు సోయం వివరించారు. అనంతరం బాపురావు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లానని ప్రకటించారు. మార్చిలో జరిగిన అల్లర్లలో 30 మంది హిందువులపై అక్రమ కేసులు పెట్టారని, సీబీసీఐడీతో విచారణ జరిపించాలని అమిత్ షాను కోరానని సోయం బాపురావు తెలిపారు. 


ఇటీవల భైంసా అల్లర్ల వెనక కుట్ర కోణం దాగి ఉందని, ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డికి తెలంగాణ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎంపీలు ధర్మపురి అరవింద్‌, సోయం బాపురావు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకట స్వామి నేతృత్వంలో ప్రతినిధుల బృందం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2021-07-28T20:39:34+05:30 IST