Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌పై ప్రశంసలు గుప్పించిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

అమరావతి: సీఎం జగన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డితో తనకు అనేక సంవత్సరాలు నుండి పరిచయముండేదని గుర్తుచేశారు. అయితే జగన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. జగన్‌తో సుబ్రహ్మణ్యస్వామి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎయిర్ ఇండియా ప్రైవేటికరణ కూడా వ్యతిరేకించానని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై తనను ఎవరు ఏమి అడగలేదని తెలిపారు. జగన్ ఇప్పటికే అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారని సుబ్రహ్మణ్యస్వామి కొనియాడారు.

Advertisement
Advertisement