మోడల్‌ గృహాలు త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-03-04T05:28:31+05:30 IST

మండలంలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు త్వరితగతిన మోడల్‌ గృహాల నిర్మాణాలు ప్రారంభించే విధంగా ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు కృషి చేయాలని ఎంపీవో పి.జగదాంబ అన్నారు

మోడల్‌ గృహాలు త్వరగా పూర్తిచేయాలి

కొవ్వూరు, మార్చి 3 : మండలంలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు త్వరితగతిన మోడల్‌ గృహాల నిర్మాణాలు ప్రారంభించే విధంగా ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు కృషి చేయాలని ఎంపీవో పి.జగదాంబ అన్నారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థలాలకు మ్యాపింగ్‌, రిజిస్ట్రేషన్‌, జియోట్యాగింగ్‌ త్వరగా పూర్తిచేయాలన్నారు. మోడల్‌ గృహాలు నిర్మాణంలో గ్రామ నాయకుల సహకారం తీసుకోవాలన్నారు. గృహనిర్మాణశాఖ ఈఈ బి.తారాచంద్‌, డీఈ టి.శ్రీనివాసులు, ఏఈ పీవీఎన్‌ సత్యప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-04T05:28:31+05:30 IST