పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై అవగాహన

ABN , First Publish Date - 2020-10-24T10:59:35+05:30 IST

పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని ఎంపీడీవో కె.కిషోర్‌కుమార్‌ అన్నారు.

పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై అవగాహన

గజపతినగరం, అక్టోబరు 23: పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని ఎంపీడీవో కె.కిషోర్‌కుమార్‌ అన్నారు. స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శుక్రవారం రెండో రోజు శిక్షణా క్యార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి గ్రామాల్లో అభివృద్ధి పనులను గుర్తించి నివేదికలను తయారు చేయా లన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ జి.జనార్దనరావు, గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫ మక్కువ: గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఎంపీడీవో సీహెచ్‌ సూర్యనారాయణ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లతో ఆయన శుక్రవారం పంచాయతీ అభివృ ద్ధి ప్రణాళికపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ భోగాపురం: పంచాయతీల్లో అభివృద్ధి ప్రణాళిక తయారీపై కార్యదర్శులు పూర్తి అవగాహన చెందాలని ఎంపీడీవో డి.బంగారయ్య అన్నారు.


పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారీపై స్థాని క మండలపరిషత్‌ కార్యాలయంలో ఆయన శిక్షణా కార్యక్రమం నిర్వహించా రు. ఈవోపీఆర్‌డీవో రామారావు, కార్యదర్శులు పాల్గొన్నారు.  ఫ గరుగుబిల్లి: పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎంపీడీవో జి.గిరిబాల కోరారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక, మనం- మన పరిశుభ్రతపై రెండో రోజు శిక్షణ నిర్వ హించారు.  అభివృద్ధి పనులకు సంబంధించి ముందస్తు పరిశీలన చేసి తదుపరి ప్రణాళికలు రూపొందించాలన్నారు. పంచాయతీ విస్తరణాధికారి ఎల్‌.గోపాలరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ గౌరీశంకరరావు, డాక్టర్‌ పీఏ ప్రియాం క, రిసోర్స్‌పర్సన్లు బడే మనోహన్‌చ టి.భాస్కరరావు,  పాల్గొన్నారు.  ఫ మెరకముడిదాం: పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీకి సంబం ధించి శిక్షణ తరగతుల్లో అందించిన సూచనలు పాటించాలని ఎంపీడీవో త్రినాఽథరావు తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, డిజిటల్‌ సహాయకులతో సమావేశం నిర్వ హించారు. పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్‌ బి.రత్నకుమార్‌, ఈవోఆర్డీ విమలకుమారి, తాగునీటిశాఖ ఏఈ ఆర్‌.పార్వతి, ఏవో జి.శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T10:59:35+05:30 IST