Abn logo
Sep 23 2021 @ 23:35PM

ఎంపీపీ పదవి ఎవరిని వరించేనో..!

నేడు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ

తొలి మండలాధ్యక్షుడు వెంకటరెడ్డి  

మార్కాపురం, సెప్టెంబరు 23: మార్కాపురం ఎం పీపీ పదవి ఎవరిని వరించనుందోనన్న విషయంపై స ర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మార్కాపురం మం డ లాధ్యక్ష పదవికి ఇప్పటికి ఆరు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2021 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలకు సం బంధించి మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలలో వైసీ పీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. మార్కాపురం ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది. మం డలంలో అన్ని ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైననాటి నుంచి తిప్పాయపాలెం ఎంపీటీసీ బండి లక్ష్మీదేవి, నా యుడుపల్లి ఎంపీటీసీ పోరెడ్డి అరుణలో పోటీపడు తున్నారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎంపీటీసీ, జ డ్పీటీసీల ఫలితాలు వెలువడి ఎంపీపీల ఎంపికకు సం బంధించి నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో వారిద్దరి ఎంపికపై మార్కాపురం మండలంలో సర్వత్రా ఉ త్కంఠ కొనసాగుతోంది. ఉపాధ్యక్ష పదవికి ఎంపిక పూర్తయింది. బీసీ సామాజిక వర్గానికి మండలంలోని రాయవరం-2 ఎంపీటీసీ దేవండ్ల లక్ష్మమ్మను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అంగీకరిం చారు. పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద గురువారం ఉదయం నుంచి ఎంపీపీ అభ్యర్థి ఎంపికపై పలు దఫా లుగా ఎంపీటీసీలు, పోటీ పడుతున్న అభ్యర్థులతో ఎమ్మెల్యే కుందురు చర్చలు జరుపుతున్నారు. ఎవరినీ నొప్పించక, తానొవ్వక అన్న రీతిలో వ్యవహరిస్తున్న ఎ మ్మెల్యే కుందురు  ఇద్దరినీ ఒప్పించిన అనంతరం  ఎంపీపీ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకో వాలన్న అభిప్రాయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారనే ఉత్కం ఠకు నేడు తెరపడనుంది.

తొలి ఎంపీపీగా జంకె వెంకటరెడ్డి

మార్కాపురం మండల పరిషత్‌ అధ్యక్షునిగా తొలి సారి ఆ పీఠాన్ని అలంకరించిన వ్యక్తి జంకె వెంకటరెడ్డి. మండలాలకు ఎన్నికలు జరిగిన 1987 నుంచి 1991 వరకూ ఆయన ఎంపీపీగా పనిచేశారు. తరువాత నారు నాగిరెడ్డి(1996-2001), నూనె వీరారెడ్డి (2001- 2006), మంగమూరి పోలమ్మ(2006-2011), ఎల్‌. మాలకొండయ్య(2014-19) వరకూ పనిచేశారు. 1991 నుంచి 96 వరకూ ప్రత్యేకాధికారుల పాలన సాగింది. 

తర్లుపాడులో..

తర్లుపాడు : తర్లుపాడు మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక గురువారం ఉద యం 10 గంటలకు ఎం పీడీవో కార్యా లయంలో జరుగుతుందని ఎం పీడీవో ఎస్‌. నరసిం హులు తెలిపారు. ఉద యం 10 గం. నుంచి 12 గంటల వరకు కో ఆప్షన్‌ నామినేషన్‌ కార్యక్రమం, 3 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకుంటారని తెలిపారు.  సమావేశానికి మండలం లోని 10 మంది మండల  ప్రాదేశిక సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు. 

కొమరోలులో..

కొమరోలు : స్థానిక మండల ప్రజా పరిషత్‌   శుక్రవారం మండల పరిషత్‌  అధ్యక్షుడు, వైస్‌ ఎంపీపీ, కోప్షన్‌ సభ్యుల ఎన్నిక జరుగనుంది.  కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో శ్రీనివాస కుమార్‌ తెలిపారు.  ఒంటి గంటకు ఎంపీటీసీ సభ్యు లు సమావేశమై మండల కోఆప్షన్‌ సభ్యుడిని అనం తరం 3 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్ను కోనున్నారు.