Abn logo
Sep 20 2021 @ 23:26PM

‘కళా’ను కలిసిన ఎంపీటీసీ విజేతలు

కళాను అభినందిస్తున్న ఎంపీటీసీ విజేతలు

రాజాం, సెప్టెంబరు 20: ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన పలువురు టీడీపీ నేతలు సోమవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి కళావెంకటరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజాంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బెవర జగన్నాథం (మెట్టవలస-జిసిగడాం), పిసిని అసిరినాయుడు (కోష్ట-రణస్థలం), ములుల సాయి (బుడతవలస, లావేరు) కలిశారు. ఈ సందర్భంగా వారిని కళా అభినందించారు. ఎన్నికలను బహిష్కరించినప్పటికీ పోటీ చేసి విజయం సాధించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయుకులు కుమరాపు రవికుమార్‌, కామో జుల సీతారాం, గొల్లాజీ, పైడి అప్పడుదొర, చందన అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.