డీలర్లపై తహసీల్దార్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-11T05:22:22+05:30 IST

కరోనా సమయంలో పేద ప్రజలకు అందించాల్సిన బియ్యం ఇవ్వకుండా నిరసన వ్యక్తం చేయడం పట్ల తహసీల్దార్‌ నాగభూషణం డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీలర్లపై తహసీల్దార్‌ ఆగ్రహం

మద్దికెర, మే 10: కరోనా సమయంలో పేద ప్రజలకు అందించాల్సిన బియ్యం ఇవ్వకుండా నిరసన వ్యక్తం చేయడం పట్ల తహసీల్దార్‌ నాగభూషణం డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని చౌకదుకాణం డీలర్లు ఎండీయూ ఆపరేటర్లకు బియ్యం ఇవ్వలేదని తెలుసుకున్న తహసీల్దార్‌ వారిని కార్యాలయానికి పిలిచి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలకు ఉచితంగా అందించాల్సింది పోయి నిరసన వ్యక్తం చేయడం మంచిది కాదన్నారు. 


 భౌతికదూరం పాటించడం లేదు  

 ఎండీయూ ఆపరేటర్లు బియ్యం పంపిణీలో భౌతికదూరాన్ని పాటించడం లేదని పలువురు తహసీల్దార్‌ నాగభూషణంకు వినతిపత్రాన్ని సోమవారం అందజేశారు. ఆపరేటర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు  ఇళ్ల వద్దకు వచ్చి బియ్యం ఇవ్వకుండా వీధిలోని వాళ్లను ఒకచోటికి చేర్చి రేషన్‌ పంపిణీ చేస్తున్నారని అన్నారు.


Updated Date - 2021-05-11T05:22:22+05:30 IST