కుటుంబం చిన్నాభిన్నం

ABN , First Publish Date - 2021-05-17T05:36:36+05:30 IST

కుటుంబం చిన్నాభిన్నం

కుటుంబం చిన్నాభిన్నం

 పదేళ్ల కిందట తండ్రి డెంగీతో మృతి

 నేడు తల్లి కరోనాతో మృతి

 అనాథలైన ఇద్దరు చిన్నారులు

భీమదేవరపల్లి, మే 16:  కరోనా ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. తండ్రి పదేళ్ల కిందట డెంగీతో మృతిచెందగా, తల్లి కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందింది. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ విషాద ఘటన ముల్కనూర్‌లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఉన్నాయి. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన వంగ సుప్రియను హన్మకొండకు చెందిన రాజే్‌షకు ఇచ్చి 12ఏళ్ల కిందట వివాహం చేశారు. రాజేష్‌ (45), సుప్రియ(40)లు ఇద్దరు ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేశారు. రాజేష్‌ ఒక ఇంజనీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, సుప్రియ ఔట్‌ సోర్సింగ్‌  లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి అక్షయ, సిద్ధు అనే ఇద్దరు పిల్లలున్నారు. సంసారం సాఫీగా సాగిపోతున్న క్రమంలో రాజేష్‌ డెంగీ జ్వరంతో పదేళ్ల కిందట మృతి చెందాడు. అప్పటికి బాబు సిద్దార్థ రెండు నెలల పసిగుడ్డు. భర్త మరణించిన నాటి నుంచి మొక్కవొని దీక్షతో పిల్లలిద్దరిని సాకుతూ తండ్రి లేని లోటు తీర్చింది. కాగా, వారం కిందట సుప్రియ కూడా కరో నా వ్యాధి సోకింది. ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెం దింది. సుప్రియ మృతదేహాన్ని ముల్కనూర్‌లో దహనం చేశారు. సుప్రియ మృతి తో ఆమె పిల్లలు ఇద్దరు అనాథలుగా మారి బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్నారు.

Updated Date - 2021-05-17T05:36:36+05:30 IST