కరోనాతో సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-08T06:40:45+05:30 IST

పంజాగుట్ట ప్రతా్‌పనగర్‌ సీతారామాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న సాయిబాబా ఆలయం ప్రధాన అర్చకుడు ఏఎల్‌ నర్సింహమూర్తి కరోనాతో శుక్రవారం మృతి చెందారు.

కరోనాతో సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకుడి మృతి

బంజారాహిల్స్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): పంజాగుట్ట ప్రతా్‌పనగర్‌ సీతారామాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న సాయిబాబా ఆలయం ప్రధాన అర్చకుడు ఏఎల్‌ నర్సింహమూర్తి కరోనాతో శుక్రవారం మృతి చెందారు. ఆయన పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఉపితిత్తుల సమస్య తలెత్తడంతో బంజారాహిల్స్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. నర్సింహమూర్తికి ఇద్దరు కుమారులు. బస్తీ పెద్దలు సంతాపం ప్రకటించారు.  

షెడ్యూల్డ్‌ కులాల హక్కుల నేత..

అడ్డగుట్ట, మే 7 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ నాయకుడు మాదరి సుధాసుఖ్‌ వీర్‌ మృతి దళితులకు తీరని లోటని ఆలిండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. బాలకృష్ణ, జాతీయ వర్కింగ్‌ అధ్యక్షుడు రాయకంటి నర్సింగ్‌రావు అన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆయన కొవిడ్‌తో శుక్రవారం కన్ను మూశారని వివరించారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల ప్రజల్లో చైతన్యం నింపి వారి సంక్షేమం కోసం నిరంతరం సేవ చేసిన వ్యక్తి అని కొనియాడారు. పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయంలో ఆడిటర్‌గా పనిచేస్తూనే టీఎన్జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. 



Updated Date - 2021-05-08T06:40:45+05:30 IST